News May 15, 2024
నాకు బహిరంగ క్షమాపణ చెప్పండి: మెహరీన్
తన ఎగ్ ఫ్రీజింగ్ ప్రకటనపై తప్పుడు పోస్టులు చేసినవారు వాటిని తొలగించి, క్షమాపణ చెప్పాలని హీరోయిన్ మెహరీన్ డిమాండ్ చేశారు. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం గర్భవతులు కానవసరం లేదని మండిపడ్డారు. ఇప్పుడే పిల్లలు వద్దని భావించే వారికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు. తల్లి కావడం కోసం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నట్లు మెహరీన్ ఇటీవల పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
Similar News
News January 11, 2025
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్: కొత్త రూల్స్ ఇవే
TG: వచ్చే విద్యా సంవత్సరంలో SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
☛ విద్యార్థుల పేరు ఆధార్, టెన్త్ మెమోలో ఒకేలా ఉండాలి
☛ మీ సేవ కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ పూర్తిచేయాలి
☛ తర్వాత ఈ-పాస్ <
☛ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి
☛ కాలేజీ యాజమాన్యాలే విద్యార్థుల అప్లికేషన్లను పరిశీలించి అధికారులకు పంపాలి
News January 11, 2025
రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానం: సీఎం
TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 11, 2025
ALERT.. పెరగనున్న చలి తీవ్రత
TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్‌లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్‌కల్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.