News September 10, 2024
కొత్త లైన్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి బండి వినతి
TG: కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయన నివాసంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. దీంతో పాటు జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా ఆదేశించాలన్నారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బండి ట్వీట్ చేశారు.
Similar News
News October 7, 2024
జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 7, 2024
అదృష్టంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు: కాంగ్రెస్ ఎంపీ
రాహుల్ గాంధీ, డీఎంకే నేతలపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు ఎంపీ(INC) తిరునావుక్కరసర్ మండిపడ్డారు. ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. తమిళనాడు నేతలను విమర్శించే స్థాయి ఆయనకు లేదని, అంతపెద్ద నాయకుడేమీ కాదని చెప్పారు. పవన్ రాజకీయాల్లోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి అని, వీధుల్లో వెలిసే విగ్రహం వంటివారని పేర్కొన్నారు.
News October 7, 2024
పాజిటివ్ సిగ్నల్స్ పంపిన ఆసియా స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. జపాన్ నిక్కీ, తైవాన్ సూచీలు 2% మేర పెరిగాయి. హాంగ్‌సెంగ్, స్ట్రెయిట్ టైమ్స్, గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఎకానమీ, జాబ్ డేటా మెరుగ్గా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణాలు. పైగా డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు పెరిగాయి. RBI MPC ప్రభావం మన మార్కెట్లపై ఉండొచ్చు.