News September 30, 2024

రూ.7,200 కోట్లివ్వండి.. కేంద్రానికి రాష్ట్రం లేఖ

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

Similar News

News September 30, 2024

బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది!

image

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్‌లు జంటగా నటించారు.

News September 30, 2024

ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.