News June 19, 2024
సామర్థ్యానికి తగ్గ పదవి ఇచ్చారు: నాగబాబు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తగిన పదవులు, శాఖలు వచ్చాయని జనసేన నేత నాగబాబు అన్నారు. పవన్ సామర్థ్యానికి తగిన పదవి దక్కిందని చెప్పారు. పవన్ అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి అని, డిప్యూటీ సీఎంగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News September 9, 2024
MPలో స్పోర్ట్స్ క్యాలెండర్‌లోకి ‘పిట్టు’
కనుమరుగైపోతున్న ‘పిట్టు’ గేమ్‌ను మధ్యప్రదేశ్ విద్యాశాఖ స్పోర్ట్స్ క్యాలెండర్‌లో చేర్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆట ఆడేవారని, ఇది దేశంలోనే అతి పురాతన ఆటల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఇక నుంచి అక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీన్ని పల్లి, లగోరీ అని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇంతకీ మీ ఏరియాలో దీన్ని ఏమంటారు?
News September 9, 2024
స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు: సీఎం రేవంత్
TG: IITHకు వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. IITH ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News September 9, 2024
గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం!
ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉపనది ప్రాణహితకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీరంతా ఒకటి, రెండు రోజుల్లో గోదావరికి చేరనుంది. అటు ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి నదులకు సైతం ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.