News January 5, 2025

జార్జ్ సోరోస్‌కు మెడ‌ల్ ఇవ్వ‌డం హాస్యాస్ప‌దం: మ‌స్క్‌

image

జో బైడెన్ నిర్ణ‌యాల‌పై ఎలాన్ మ‌స్క్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. బిలియ‌నీర్ జార్జ్ సోరోస్‌ను Presidential Medal of Freedomతో గౌర‌వించడం హాస్యాస్ప‌దం అని విమ‌ర్శించారు. ప్ర‌జాస్వామ్య బ‌లోపేతం, మాన‌వ హ‌క్కులు, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మెడ‌ల్‌కు ఎంపిక చేసిన‌ట్టు వైట్ హౌస్ తెలిపింది. అయితే, ఇది రాజ‌కీయ ప్రేరేపిత నిర్ణ‌య‌మ‌ని రిప‌బ్లిక‌న్స్ మండిపడుతున్నారు.

Similar News

News February 2, 2026

ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

image

☛ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
☛ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
☛ 1940: రచయిత ఎస్.వి. రామారావు జననం
☛ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
☛ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
☛ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం (ఫొటోలో)

News February 2, 2026

గజినీ తరహా రోల్‌లో సూర్య! ఆసక్తి రేపుతున్న కొత్త మూవీ టైటిల్..

image

కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జులైలో విడుదల కానున్న ఈ చిత్రంలో సూర్య పాత్ర గజినీ తరహాలో ఉంటుందని టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో సూర్య నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో రాధిక, రవీనా టాండన్, హీరోయిన్‌గా మమితా బైజు నటిస్తున్నారు.

News February 2, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.