News January 5, 2025
జార్జ్ సోరోస్‌కు మెడల్ ఇవ్వడం హాస్యాస్పదం: మస్క్
జో బైడెన్ నిర్ణయాలపై ఎలాన్ మస్క్ మరోసారి విరుచుకుపడ్డారు. బిలియనీర్ జార్జ్ సోరోస్‌ను Presidential Medal of Freedomతో గౌరవించడం హాస్యాస్పదం అని విమర్శించారు. ప్రజాస్వామ్య బలోపేతం, మానవ హక్కులు, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా మెడల్‌కు ఎంపిక చేసినట్టు వైట్ హౌస్ తెలిపింది. అయితే, ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని రిపబ్లికన్స్ మండిపడుతున్నారు.
Similar News
News January 24, 2025
రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని
AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.
News January 24, 2025
2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.
News January 24, 2025
20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.