News August 6, 2024
జగన్కు జడ్+ సెక్యూరిటీ ఇస్తున్నాం: పోలీస్ శాఖ

AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ <<13783949>>హైకోర్టుకు<<>> వెళ్లడంతో అధికారులు స్పందించారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్కు అలాగే ఇచ్చామన్నారు.
Similar News
News November 15, 2025
పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.
News November 15, 2025
CSK నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

ఓపెనర్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్(CSK) వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాన్వే ట్వీట్ చేశారు. మూడేళ్లు పాటు మద్దతుగా నిలిచిన CSK ఫ్యాన్స్కు Xలో ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లో జెర్సీతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేశారు. ఐపీఎల్లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.


