News August 30, 2024

నావిగేషన్ చదివి వినిపించే కళ్లద్దాలు.. ఆదిలాబాద్ కుర్రాడి ఘనత

image

దృష్టి లోపం ఉన్న వారి కోసం ADLB ఇంజినీరింగ్ విద్యార్థి టి. ర‌వికిర‌ణ్ త‌యారు చేసిన బ్లైండ్ ఐ క‌ళ్ల‌ద్దాల‌కు అంత‌ర్జాతీయ అవార్డు ద‌క్కింది. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో UNICEF నిర్వహించిన గ్లోబల్ ఇంక్యుబేషన్ వీక్‌లో దీన్ని ప్ర‌ద‌ర్శించారు. అధునాతన సెన్సార్లు, కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్‌లు క‌లిగిన‌ ఈ క‌ళ్ల‌ద్దాలు సురక్షితమైన నావిగేషన్‌‌ను చెప్పగలవు. వ‌స్తువుల‌ను గుర్తుప‌ట్టి చ‌దివి వినిపించ‌గ‌ల‌వు.

Similar News

News September 19, 2024

‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.

News September 19, 2024

బంగ్లాతో తొలి టెస్టు: మూడు వికెట్లు కోల్పోయిన భారత్

image

చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత టాపార్డార్ తడబడింది. బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ ధాటికి 34 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 6 పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన గిల్ 8 బంతులాడి ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. అనంతరం కింగ్ కోహ్లీ 6 పరుగులే చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ యశస్వి(17), పంత్(0) ఉన్నారు.

News September 19, 2024

‘జమిలి’కి రాష్ట్రాలు అంగీకరిస్తాయా?

image

జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే కీల‌క రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌తో పాటు రాష్ట్రాల స‌మ్మ‌తి కూడా అవసరం. జ‌మిలికి 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఎన్డీయేకి ఇబ్బందులు లేన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో 20 రాష్ట్రాల్ని ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు పాలిస్తున్నాయి. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది. దీంతో ఈ విష‌యంలో ఎన్డీయేకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు.