News November 24, 2024
పంజాబ్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ధర ఎంతంటే..
గత ఏడాది ఆర్సీబీకి ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఈ ఏడాది వేలంలో రూ. 4.20 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. గత సీజన్‌లో మ్యాక్సీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 10 మ్యాచులాడి 52 పరుగులే చేశారు. మొత్తంగా ఐపీఎల్‌లో 134 మ్యాచులాడి 156 స్ట్రైక్ రేట్‌తో 2771 రన్స్ చేశారు. బౌలింగ్‌లో 37 వికెట్లు తీశారు.
Similar News
News December 11, 2024
మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: బీజేపీ ఎంపీ
TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నిన్న వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తప్పుబట్టారు. జర్నలిస్టు సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.
News December 11, 2024
‘అఖండ2’ నుంచి సాయంత్రం బిగ్ అప్డేట్
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ2’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 5.31 గంటలకు రోరింగ్ అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ పూజా కార్యక్రమం జరుగుతుందని టాక్.
News December 11, 2024
నో.. నో: రాహుల్‌కు షాకిచ్చిన కేజ్రీవాల్
కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ఆమ్‌ఆద్మీ షాకిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు 1-2, మిగిలిన వాటిలో ఆప్ పోటీచేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ANI చేసిన ట్వీటుకు అరవింద్ కేజ్రీవాల్ పైవిధంగా బదులిచ్చారు.