News December 6, 2024
12న ‘SDT18’ టైటిల్, గ్లింప్స్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘SDT18’ టైటిల్, గ్లింప్స్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కత్తి పట్టుకుని ఉన్న పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీన్నిబట్టి తేజ్ ఈసారి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రోహిత్ కేపీ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగళ్ల కీలకపాత్రలో నటిస్తున్నారు.
Similar News
News January 21, 2025
ఇన్వెస్టర్లకు ₹6లక్షల కోట్ల నష్టం.. కారణాలివే
బేర్స్ దెబ్బకు దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ఆరంభం నుంచీ ఆటుపోట్లకు లోనవుతున్న బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పుడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 75,900 (-1200), నిఫ్టీ 23,039 (-310) వద్ద చలిస్తున్నాయి. దీంతో నేడు రూ.6L CR ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ 100% టారిఫ్స్ ప్రకటన, బలహీన క్యూ3 ఫలితాలు, BOJ వడ్డీరేట్ల పెంపు అంచనా, FIIs వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.
News January 21, 2025
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు
TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి, BJP నేత మాధవీలత సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జేసీపై ఆమె ‘మా’, ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలకు యువతులు వెళ్లొద్దంటూ మాధవి ఓ వీడియో విడుదల చేయగా, ఆమెపై జేసీ ఫైరయ్యారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు.
News January 21, 2025
ఒకే చోట రూ.82 లక్షల కోట్లు
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.