News March 23, 2026
GNT: ఇంటర్ విద్యలో కొత్త మార్పులు.. ఏప్రిల్ నుంచే అమలు

గుంటూరులో ఇంటర్ విద్యలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త విద్యా సంవత్సరంలో ఇవి అమల్లోకి రానున్నాయి. ద్వితీయ సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలంటూ బోర్డు ఆదేశించింది. అకడమిక్ క్యాలెండర్లో 232 పని దినాలు, 82 సెలవులు ఉండనున్నాయి. గతేడాది అమలు చేసిన కొత్త సిలబస్ కొనసాగించనున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచడం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారు.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.