News April 24, 2024
దొరల పెత్తనమని.. బీఆర్ఎస్లోకే వెళ్లారు: రేవంత్
TG: IPS పదవికి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తే తాము అండగా నిలబడినట్లు CM రేవంత్ వెల్లడించారు. ‘దొరల పెత్తనం సహించలేక రాజీనామా చేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్లోకి రావొచ్చు కదా? దొరల పెత్తనమని చెప్పి.. మళ్లీ BRS పార్టీలోనే చేరారు. TSPSC ఛైర్మన్గా నియమించాలని అనుకున్నాం. ఆయన తిరస్కరించారు. IPSగా ఆయన ఉండుంటే.. డీజీపీని చేసేవాళ్లం’ అని తెలిపారు.
Similar News
News November 20, 2024
ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా!
ఆస్ట్రేలియా ఏటా 7 సెంటీమీటర్ల మేర ఉత్తర దిశగా కదులుతోంది. ఖండాల కింద ఉండే భూ ఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కదలిక మరీ ఎక్కువగా ఉన్న చోట భూకంపాలు కూడా సంభవిస్తుంటాయి. ఆస్ట్రేలియా కింద ఉన్న ఫలకమంతా ఉత్తరదిశగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, అది వేరే ఏ ఖండాన్ని ఢీ కొట్టాలన్నా లక్షల సంవత్సరాలు పడుతుందని అంచనా.
News November 20, 2024
ఈ చేపలు తింటే అయోమయానికి లోనవుతారు!
చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే, కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. అందులో మధ్యదరా సముద్రంలో దొరికే సలేమా పోర్జీ చేప ఒకటి. ఒకవేళ ఈ చేపను తింటే ఆశ్చర్యకరమైన దుష్ప్రభావం చూపుతుంది. దీనిని తిన్న వ్యక్తి 36 గంటల పాటు అయోమయానికి లోనవుతారు. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. రోమన్ సామ్రాజ్యంలో వినోద ప్రయోజనాల కోసం దీనిని తినేవారు.
News November 20, 2024
ఐటీడీపీ నుంచే మా అమ్మ, చెల్లిని తిట్టించారు: జగన్
AP: తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘CBN నన్ను బోసిడీకే అని తిట్టించాడు. జూబ్లీహిల్స్ 36లోని బాలకృష్ణ బిల్డింగ్ నుంచే షర్మిలపై తప్పుడు రాతలు రాయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వర్రా రవీంద్ర పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ITDP సభ్యుడు ఉదయ్ భూషణ్ చేత మా అమ్మ, చెల్లిని తిట్టించారు. ఫిబ్రవరిలోనే అతడిని అరెస్టు చేశాం’ అని గుర్తు చేశారు.