News March 21, 2024
దేవుడే కుప్పకూలాడనుకున్నా: కంగనా

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ని ICU బెడ్‌పై చూసి ఆందోళన చెందినట్లు నటి కంగన రనౌత్ పేర్కొన్నారు. ‘ICU బెడ్‌పై పడుకున్న సద్గురుని చూసి.. ఆయన కూడా మనలాగే ఎముకలు, రక్తమాంసాలున్న మనిషేనని అనుకున్నా. ఇది వరకూ ఆయన ఓ దేవుడిలా కనిపించేవారు. ఆ దేవుడే కుప్పకూలిపోయినట్లు భావించా. ఈ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోలేను. ఎంతోమందిలా నేను కూడా నా బాధను మీతో పంచుకోవాలనుకున్నా. ఆయన బాగుండాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News April 7, 2026
చిరంజీవి చొరవ చూపాలి: కేశినేని చిన్ని

AP: గత ప్రభుత్వం సినీ పరిశ్రమను హింసిస్తే తాము ఎంతో గౌరవిస్తున్నామని MP కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ‘అవసరమైనప్పుడు ఇండస్ట్రీతో చర్చిస్తాం. ఇందుకు చిరంజీవి చొరవ చూపాలి. టాలీవుడ్‌కు 65% ఆదాయం వచ్చే APలో కనీసం 25% షూటింగ్స్ జరిపితే బాగుంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
News April 7, 2026
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలే!

2026 వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 6% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ఎల్ నినో ప్రభావం వల్ల జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయని అంచనా వేసింది. ఈ ఏడాది కరవు వచ్చే ముప్పు 30% ఉందని, సగటు వర్షపాతం 94%కే పరిమితం కావచ్చని తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా త్వరలోనే తన తొలి అధికారిక అంచనాలను విడుదల చేయనుంది.
News April 7, 2026
ఆరోగ్యం చూసుకోండి బ్రో!

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నట్లుగా.. సంపద కంటే ఆరోగ్యమే మిన్న అని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాధులు సోకకముందే జాగ్రత్త పడటం మేలు. *సంపాదనలో పడి హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తే దానిని అనుభవించడానికి మీరుండరు. గుర్తుంచుకోండి.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. SHARE IT


