News March 21, 2024
దేవుడే కుప్పకూలాడనుకున్నా: కంగనా
సద్గురు జగ్గీ వాసుదేవ్‌ని ICU బెడ్‌పై చూసి ఆందోళన చెందినట్లు నటి కంగన రనౌత్ పేర్కొన్నారు. ‘ICU బెడ్‌పై పడుకున్న సద్గురుని చూసి.. ఆయన కూడా మనలాగే ఎముకలు, రక్తమాంసాలున్న మనిషేనని అనుకున్నా. ఇది వరకూ ఆయన ఓ దేవుడిలా కనిపించేవారు. ఆ దేవుడే కుప్పకూలిపోయినట్లు భావించా. ఈ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోలేను. ఎంతోమందిలా నేను కూడా నా బాధను మీతో పంచుకోవాలనుకున్నా. ఆయన బాగుండాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
అన్‌ఫిట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సింగరేణి సీఎండీ
TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.
News September 19, 2024
జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే?
జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.
News September 19, 2024
తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు
TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.