News October 1, 2024

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి జలాలు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ జలాశయం నుంచి మూసీకి నీటిని తరలిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, గత ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. గతంలో మూసీ ప్రక్షాళన కోసం తెచ్చిన రూ.1,000 కోట్ల అప్పు ఎందుకోసం ఖర్చు చేశారని నిలదీశారు.

Similar News

News October 4, 2024

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

News October 4, 2024

Stock Market: మ‌ళ్లీ నేల‌చూపులు

image

స్టాక్ మార్కెట్లు మ‌ళ్లీ నేల‌చూపులు చూశాయి. ప్రారంభ సెష‌న్‌లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మ‌ధ్నాహ్నం 12.30 గంట‌ల‌కు రివ‌ర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు న‌ష్టంతో 81,688 వ‌ద్ద‌, నిఫ్టీ 200 పాయింట్ల భారీ న‌ష్టంతో 25,049 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఒకానొక ద‌శ‌లో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.

News October 4, 2024

పెళ్లి సందడి.. ఈ సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు!

image

రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. 45రోజుల పాటు సాగే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని తెలిపింది.