News October 15, 2024
రాత్రి తినకుండా పడుకుంటున్నారా?
రాత్రి పూట భోజనం మానేస్తే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తుంటారు. కానీ భోజనానికి బదులు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలసట, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తలెత్తుతాయి. పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే కొంచెమైనా తిని పడుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.
Similar News
News November 14, 2024
గడచిన 30 ఏళ్లలో రెండింతలైన మధుమేహం!
ప్రపంచాన్ని మధుమేహం వేగంగా కబళిస్తోంది. డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య గడచిన 30 ఏళ్లలో రెండింతలైంది. ది లాన్సెట్ జర్నల్ ఈ విషయాన్ని తెలిపింది. దాని ప్రకారం.. 1990లో ప్రపంచవ్యాప్తంగా 7శాతం పెద్దల్లో షుగర్ ఉండగా 2022 నాటికి అది 14శాతానికి పెరిగింది. అంకెల్లో చూస్తే వరల్డ్‌వైడ్‌గా 80 కోట్లమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. భారత్‌లోనూ మధుమేహుల సంఖ్య వేగంగా పెరుగుతోందని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది.
News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్
AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
News November 14, 2024
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి RRR తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.