News April 27, 2024

ప్రజల దగ్గరకు హీరోగా వెళ్తున్నా: జగన్

image

AP: మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేసి.. మళ్లీ ప్రజల దగ్గరకు హీరోగా వెళ్తున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు. మేనిఫెస్టో అమలుకు ఎప్పుడూ తాను సాకులు వెతుక్కోలేదని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో కూడా చిరునవ్వుతో ప్రజలకు అండగా నిలబడ్డానన్నారు. గత ఐదేళ్లలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలోనూ సంక్షేమం అందించామని చెప్పారు.

Similar News

News April 20, 2026

చరిత్ర సృష్టించిన పంజాబ్

image

IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్లో ఆడిన తొలి 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి ఎరుగని ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా మొత్తం 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (8 పాయింట్లు), రాజస్థాన్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ (6 పాయింట్లు) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.

News April 20, 2026

హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

image

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.

News April 20, 2026

వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

image

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.