News February 1, 2025
బంగారం @ All Time High

బంగారం భగభగమంటోంది. మునుపెన్నడూ చూడని విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలిసారి ఔన్స్ విలువ $2817 వద్ద All Time Highని టచ్ చేసింది. ప్రస్తుతం $2797 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, US ఫెడ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, డీడాలరైజేషన్, ట్రంప్ టారిఫ్స్‌తో ట్రేడ్‌వార్స్ ఆందోళనే ఇందుకు కారణాలని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.84,340 వద్ద కొనసాగుతోంది.
Similar News
News February 15, 2025
IMLT20 టోర్నీకి భారత జట్టు ఇదే

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఆడే భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఈనెల 22న నవీ ముంబైలో భారత్VSశ్రీలంక మ్యాచుతో ప్రారంభం కానుంది.
భారత జట్టు: సచిన్, యువరాజ్, రైనా, రాయుడు, Y పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ, కులకర్ణి, వినయ్ కుమార్, నదీమ్, రాహుల్ శర్మ, పవన్ నేగి, నమన్ ఓజా, గుర్‌కీరత్, అభిమన్యు మిథున్.
News February 15, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2025
ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం