News March 13, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.88,580కు చేరింది. అటు వెండి ధర కూడా నిన్న రూ.2వేలు, ఇవాళ రూ.1000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News March 23, 2025
IPL: మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేనా?

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH, RR మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా మరికాసేపట్లో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు నగరంపై ఇప్పటికే మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK, MI మ్యాచుకూ వరుణుడి ముప్పు ఉన్నట్లు సమాచారం.
News March 23, 2025
కత్తెర పట్టుకుంటే రూ.లక్ష ఫీజు తీసుకుంటాడు!

హెయిర్ కట్‌కు సెలూన్ షాప్‌లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్లలో రూ.200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలూన్ అయినా రూ.500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీమ్ హకీమ్ అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం రూ.లక్ష తీసుకుంటాడు. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజినీ, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పుడు సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.
News March 23, 2025
బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.