News August 3, 2024

బంగారు బాండ్లు: 122% లాభం

image

సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్టర్ల పంట పండబోతోంది. వారికి ఏకంగా 122% రాబడి వస్తోంది. 2016, ఆగస్టులో గ్రాముకు రూ.3119 చొప్పున కేంద్రం వీటిని విడుదల చేసింది. 8ఏళ్లు కావడంతో 2024, ఆగస్టు 5 రిడెమ్షన్‌కు చివరితేదీగా RBI ప్రకటించింది. రిడెమ్షన్ ధరను గ్రాముకు రూ.6938గా లెక్కకట్టింది. అంటే విలువ రెట్టింపైంది. దీంతో పాటు మదుపరులకు ఏటా 2.5% వడ్డీ వచ్చింది. SGBపై LTCG వర్తించకపోవడం మరో సానుకూల అంశం.

Similar News

News December 10, 2025

అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

image

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.

News December 10, 2025

గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

image

హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల వైరస్‌ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>