News March 7, 2025
రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు!

వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.79,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గడంతో రూ.87,160కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,08,100గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News March 18, 2025
జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
News March 18, 2025
అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్‌ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.
News March 18, 2025
నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.