News February 15, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.78,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1090 తగ్గడంతో రూ.86,070కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది.
Similar News
News March 16, 2025
రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా?: కోహ్లీ

ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని BCCI విధించిన తాజా నిబంధనపై విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మ్యాచుల్లో ఎంతో తీవ్రతతో ఆడుతుంటాం. మ్యాచ్ పూర్తికాగానే కుటుంబం చెంతకు చేరడం ఎంతో రిలీఫ్ ఇస్తుంటుంది. అది ఆటగాళ్లకు చాలా అవసరం. అంతేకానీ మ్యాచ్ ముగిశాక రూమ్‌లో ఒంటరిగా చింతిస్తూ కూర్చోవాలా? కుటుంబాలు మాతో ఉండటం ఎంత అవసరమో కొంతమందికి తెలియట్లేదు’ అని పేర్కొన్నారు.
News March 16, 2025
రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం

AP: CM చంద్రబాబు సమక్షంలో హడ్కో- CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించగా, నేడు ఆ మేరకు ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. వచ్చే నెల ప్రధాని చేేతుల మీదుగా రాజధాని పనులు పున: ప్రారంభం కానున్నాయి.
News March 16, 2025
విద్యార్థులూ.. విజయీభవ: నారా లోకేశ్

AP: పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. విజయీభవ’ అని పేర్కొన్నారు.