News December 14, 2024
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. మరోవైపు సిల్వర్ ధర కూడా కేజీపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉంది.
Similar News
News January 21, 2025
బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలు
*యాక్సెంచర్ (అమెరికా)- రూ.3.47 లక్షల కోట్లు
*టీసీఎస్ (భారత్)- రూ.1.77 లక్షల కోట్లు
*ఇన్ఫోసిస్ (భారత్)- రూ.1.36 లక్షల కోట్లు
*ఐబీఎం కన్సల్టింగ్ (అమెరికా)- రూ.85వేల కోట్లు
*NTT DATA (జపాన్)- రూ.83వేల కోట్లు
*క్యాప్‌జెమినీ (ఫ్రాన్స్)- రూ.82వేల కోట్లు
*కాగ్నిజెంట్ (అమెరికా)- రూ.75వేల కోట్లు
*HCL టెక్ (భారత్)- రూ.74వేల కోట్లు
*విప్రో (భారత్)- రూ.50వేల కోట్లు
*Fujitsu (జపాన్)- రూ.34వేల కోట్లు
News January 21, 2025
కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.
News January 21, 2025
పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయిందిగా..!
ఏంటి షాక్ అయ్యారా? చైనాకు చెందిన ఓ యువతికి ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఎదురైంది. ఆ యువతి తన రాజీనామా లేఖను డ్రాఫ్ట్‌లో ఉంచింది. అయితే, ల్యాప్‌టాప్‌ను వదిలేసి వెళ్లగా అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్‌కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్ ఎండ్ బోనస్‌ను కోల్పోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డవగా, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.