News February 11, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.80,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో తొలిసారి రూ.87,930లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

Similar News

News March 27, 2025

హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

News March 27, 2025

సంపాదనలో రష్మిక మందన్న టాప్

image

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.

News March 27, 2025

రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు

image

దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 45 శాతానికి పడిపోయినట్లు CWC నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే 25 శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 155 ప్రధాన జలాశయాల సామర్థ్యం 18,080 బీసీఎంలు ఉండగా ప్రస్తుతం 8,070 బీసీఎంలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-మే నెలల్లో ఈ నీటి నిల్వలు మరింతగా అడుగంటనున్నాయి.

error: Content is protected !!