News February 20, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.80,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 పెరగడంతో రూ.88,040లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

Similar News

News March 21, 2025

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

image

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.

News March 21, 2025

మార్చి21: చరిత్రలో ఈరోజు

image

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

News March 21, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 21, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!