News September 1, 2024
హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.6,695గా, 8 గ్రాముల ధర రూ. 53,560గా ఉంది. అలాగే తులం బంగారం రూ.66,950గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.73,040గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు హైదరాబాద్‌లో గ్రాము వెండి ధర రూ. 92గా ఉంది. 8 గ్రాములు రూ.736 కాగా, 10 గ్రాముల ధర రూ. 920గా ఉంది.
Similar News
News September 12, 2024
BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్
TG: BRS నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ‘BRS హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలు. అసెంబ్లీలో మా బలం 65. BJP, BRS మా ప్రభుత్వాన్ని 3నెలల్లో కూల్చేస్తాం అంటున్నాయి. ఫిరాయింపు చట్టం కఠినంగా ఉంటే ఆ పరిస్థితి రాదు. హైకోర్టు తీర్పుని అధ్యయనం చేయలేదు. దానిపై ఇప్పుడే స్పందించలేను’ అని అన్నారు.
News September 12, 2024
పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి: CBN
AP: సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘అట్టడుగు వర్గాలతో ఏచూరికి మంచి అనుబంధం ఉంది. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన మేధావి. దేశ రాజకీయాల్లో గౌరవస్థానం పొందారు’ అని చంద్రబాబు అన్నారు. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏచూరికి కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.
News September 12, 2024
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు భారత్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. కొరియాపై నేడు జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో గెలుపొంది లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్‌లో అడుగు పెట్టింది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగిన భారత్, లీగ్ దశలో ఇప్పటి వరకూ ఓడిపోలేదు. హర్మన్‌ప్రీత్ సేన ఈ నెల 14న లీగ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండటం గమనార్హం.