News February 17, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. ఒకసారి తగ్గినట్లే తగ్గి అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి ₹ 79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది.

Similar News

News April 17, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. పూర్తి వివరాలకు www.lichousing.com/careers చూడండి.

News April 17, 2026

కేంద్ర మంత్రితో ప్రేమ.. కంగనా రనౌత్ క్లారిటీ!

image

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘చిరాగ్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పదేళ్ల కిందట మేం కలిసి సినిమా చేశాం. ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండే వారు. ఇన్నేళ్లలో మా బంధంలో ఎలాంటి మార్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. కంగనా, చిరాగ్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించారు.

News April 17, 2026

రోజూ తలస్నానం చేయొచ్చా?

image

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.