News March 12, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

Similar News

News March 19, 2025

ఉరుములు, మెరుపులతో వర్షాలు

image

TG: ఈ నెల 22న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హైదరాబాద్ తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 21, 23న తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News March 19, 2025

భయపడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు

image

బెట్టింగ్ యాప్ ప్రచారం ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలిట శాపంగా మారింది. అత్యాశకు పోతే అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. ప్రమోషన్స్ చేసిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమకు వచ్చిన ఫేమ్ అంతా ఒక్కసారిగా నాశనం అవుతుండటం వారి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. దీనికి తాజాగా ఈడీ కూడా తోడవ్వడంతో తమ పరిస్థితి ఏమవుతుందో అని కొందరు భయపడుతున్నారు.

News March 19, 2025

ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య

image

యూపీ మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్‌‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్‌ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు.

error: Content is protected !!