News January 3, 2025

Gold vs Sensex: ఫస్ట్ 100,000 మైలురాయిని తాకేదేంటి?

image

కొత్త ఏడాది కావడంతో బంగారం, సెన్సెక్స్‌లో లక్ష మైలురాయిని ఏది ముందుగా తాకుతుందన్న చర్చ జరుగుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్, అనిశ్చితి, ట్రంప్ అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది అనలిస్టులు గోల్డుకే ఓటేస్తున్నారు. కొందరు 2025, మరికొందరు 2026లో టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్ 96,000 స్థాయిని చేరొచ్చని చెప్తున్నారు. చివరి ఆరేళ్లలో GOLD 16.6%, SENSEX 14% AVG రాబడి ఇచ్చాయి.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.