News August 5, 2024
భారత్‌కు ‘గోల్డెన్’ ఛాన్స్
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో ఆస్ట్రేలియా, బెల్జియం, అర్జెంటీనా, బ్రిటన్ జట్లు ఇంటి బాట పట్టాయి. క్వార్టర్ ఫైనల్లో ఆయా జట్లు ఓటమి పాలవ్వడంతో భారత పురుషుల హాకీ జట్టుకు బంగారం లాంటి ఛాన్స్ ముందుంది. సెమీస్‌లో జర్మనీతో మ్యాచులో సత్తా చాటితే గోల్డ్ గెలిచే అవకాశం ఉంది. జట్టులోని ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ విజయాన్ని అందిస్తే దాదాపు 44 ఏళ్ల కల సాకారం అవుతుంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News September 14, 2024
ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2024
త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్
APలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. ‘3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభించాం. OCT 26న విజయవాడ-పూణె, అక్టోబర్ 27న విశాఖ-ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభిస్తాం. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతాం’ అని ప్రకటించారు.
News September 14, 2024
రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి
TG: సీఎం రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి BRS నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అరెకపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదం BRS పార్టీకి సంబంధించిన పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ, తమ జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాంతంగానే ఉందని, పోలీసులు BRS నేతలను పట్టించుకోవాలా? ప్రజలను పట్టించుకోవాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.