News April 12, 2024

ఇస్రోలో చేరేందుకు సువర్ణావకాశం!

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరాలనుకుంటున్నారా? అయితే అందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. అర్హులైన వారి నుంచి అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ కొలువులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60శాతం ఉత్తీర్ణత లేదా 10 పాయింట్ల స్కేల్‌లో కనీసం 6.32 సీజీపీఏ ఉన్నవారు ఈ నెల 15లోపుగా ఇస్రో వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

Similar News

News March 27, 2025

సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!

image

భారత్‌కు చెందిన 22 శాతం మంది అతి సంపన్నులు విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు కోటక్ ప్రైవేట్-ఈవై సర్వేలో తేలింది. ఎక్కువగా US, UK, UAE, కెనడా, ఆస్ట్రేలియాలో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. రూ.300 కోట్లకుపైగా ఆస్థి కలిగిన వారు క్వాలిటీ లైఫ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల అక్కడ స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. పిల్లల స్టడీ కోసం కూడా ఆయా దేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్నారు.

News March 27, 2025

సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

image

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.

News March 27, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

image

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.

error: Content is protected !!