News August 7, 2024

నియంత పాలన రోజులు పోయాయి: మంత్రి అచ్చెన్నాయుడు

image

AP: ఆయుధాలతో రక్షణ కల్పించే భద్రతా సిబ్బంది అంటే మాజీ సీఎం జగన్ ఆడుకొనే గేమ్‌లో బొమ్మలు కాదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 40 మండలాల్లో ప్రజలకు రక్షణగా నిలిచే 40 పోలీస్ స్టేషన్లలో ఉండేంత సిబ్బంది మీకు భద్రతా కల్పించాలా? అని ఎక్స్ వేదికగా మాజీ సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన రోజులు పోయి, చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య పాలన వచ్చిందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

Similar News

News October 17, 2025

పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్‌లైట్స్, బీమ్ హెడ్‌లైట్స్ ఉపయోగించాలని, ఓవర్‌టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News October 17, 2025

లోకేశ్‌కు కర్ణాటక మంత్రి కౌంటర్: YCP నేతలు

image

AP: పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>స్పైసీ ట్వీట్‌<<>>కు కర్ణాటక IT మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారని YCP నేతలు చెబుతున్నారు. ‘అందరూ స్పైసీ ఇష్టపడినా, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పొరుగువారి అప్పులు రూ.10లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాదిలోనే రూ.1.61లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రెవెన్యూ లోటు మరింత దిగజారి 2.65%-3.61%కి పెరిగింది’ అని ఖర్గే ట్వీట్ చేశారు.

News October 17, 2025

స్వీట్ పొటాటో తింటున్నారా?

image

చిలగడదుంప (స్వీట్ పొటాటో) పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. ‘ఒక మీడియం సైజు ఉడికించిన స్వీట్ పొటాటో మీ రోజువారీ విటమిన్ A అవసరాలను 100% పైగా అందిస్తుంది. ఇది కంటి చూపునకు, బలమైన రోగనిరోధక శక్తి & గుండె, మూత్రపిండాల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని శక్తిమంతమైన బీటా-కెరోటిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలో మంటను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది’ అని తెలిపారు.