News August 7, 2024
నియంత పాలన రోజులు పోయాయి: మంత్రి అచ్చెన్నాయుడు
AP: ఆయుధాలతో రక్షణ కల్పించే భద్రతా సిబ్బంది అంటే మాజీ సీఎం జగన్ ఆడుకొనే గేమ్‌లో బొమ్మలు కాదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 40 మండలాల్లో ప్రజలకు రక్షణగా నిలిచే 40 పోలీస్ స్టేషన్లలో ఉండేంత సిబ్బంది మీకు భద్రతా కల్పించాలా? అని ఎక్స్ వేదికగా మాజీ సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన రోజులు పోయి, చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య పాలన వచ్చిందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Similar News
News September 10, 2024
సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక
అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.
News September 10, 2024
విరాట్ బెస్ట్ బ్యాటర్.. స్టెయిన్ బెస్ట్ బౌలర్: KL రాహుల్
తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బౌలర్లలో డేల్ స్టెయిన్‌ను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. విరాట్, రోహిత్, సూర్య, బాబర్ ఆజం, ట్రావిస్ హెడ్ ప్రస్తుతం ఉత్తమ బ్యాటర్లని ఆయన అన్నారు. బౌలర్లలో స్టెయిన్, ఆండర్సన్, బుమ్రా, రషీద్, నసీమ్ షాలను అత్యుత్తమంగా భావిస్తానని పేర్కొన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు ‘మేఘా’ సంస్థ భారీ విరాళం
AP: వరద బాధితులకు మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకు ఇచ్చారు. జీఎంఆర్ సంస్థ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది.