News April 12, 2024
నిమిషాల్లోనే అయిపోయాయి

హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు దాదాపు అయిపోయాయి. పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా ఇవాళ ఉదయం 11 గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభించగా నిమిషాల్లోనే 35 వేల మందికిపైగా లాగిన్ అయ్యారు. ఎంత ట్రై చేసినా టికెట్లు దొరకడం లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్‌కు తరలించారని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Similar News
News April 19, 2026
మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.
News April 19, 2026
రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
News April 19, 2026
సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.


