News September 12, 2024
GOOD NEWS: ఆధార్ అప్డేట్ గడువు పెంపు
ఆధార్ కార్డును పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈనెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పని చేస్తుందని UIDAI తెలిపింది.
Similar News
News October 10, 2024
త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ
AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.
News October 10, 2024
ఎంత మంచి మనసయ్యా నీది!
రతన్ టాటా తన ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారు. తన ఉద్యోగి ఒకరు అనారోగ్యం పాలయ్యాడని తెలుసుకుని 83 ఏళ్ల వయసులో పుణే వెళ్లి పరామర్శించారు. మీడియాకు తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థికసాయం చేశారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రభావితమైన 80 మంది తాజ్ హోటల్ ఉద్యోగులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ టాటా గ్రూప్ నుంచి ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు.
News October 10, 2024
బరి తెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు: VSR
AP: మద్యం షాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్‌గా మారి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘కమీషన్లు, దందాలతో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. వాళ్ల అవినీతి పరాకాష్ఠకు చేరింది. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. MLAలపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదంటే శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.