News August 4, 2024

గుడ్ న్యూస్.. దోస్త్ అడ్మిషన్ల గడువు పెంపు

image

TG: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువును ఈ నెల 5వరకు పొడిగించినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తెలిపారు. అయితే వెబ్ ఆప్షన్లకు 5 వరకే అవకాశమిచ్చారు. ఈ నెల 7న సీట్ అలాట్‌మెంట్ చేయనున్నారు. 8, 9న ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు స్వయంగా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయాలని విద్యార్థులకు సూచించారు.

Similar News

News September 12, 2024

What a Rally: సెన్సెక్స్ 1439, నిఫ్టీ 470 పాయింట్లు అప్

image

స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ ఏకంగా 470 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిసింది. 15 నిమిషాల్లోనే 193 పాయింట్లు ఎగిసింది. BSE సెన్సెక్స్ 1439 పాయింట్లు ఎగిసి 82,962 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. నిఫ్టీలో నెస్లే తప్ప అన్ని షేర్లూ పెరిగాయి. హిందాల్కో, ఎయిర్‌టెల్, NTPC టాప్ గెయినర్స్.

News September 12, 2024

వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్న Z జనరేషన్!

image

ఉద్యోగులుగా కాదు ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని Gen Z యువత కోరుకుంటోంది. 1997-2012లో జన్మించిన వారిని జనరేషన్ Z అని పిలుస్తారు. 77% మంది తామే బాస్‌లుగా ఉండాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వీరిలో 39% మంది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలమని నమ్ముతున్నారు. ఆవిష్కరణ, సాంకేతికత, స్వాతంత్య్రమే భవిష్యత్తు అని ఈ తరం నిరూపిస్తోంది.

News September 12, 2024

దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిన రాహుల్: బండి సంజయ్

image

TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఆయన భారత్‌ను విడిచి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు. దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించిన విషయం తెలిసిందే.