News September 11, 2025
10 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్

TG: భూభారతి చట్టం కింద సాదా బైనామా (నమోదు కాని లావాదేవీలు) క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించిన రైతుల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది.
Similar News
News September 11, 2025
మంచి మనసు చాటుకున్న లారెన్స్!

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.
News September 11, 2025
టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

ఆసియా కప్‌లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్‌పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.
News September 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.