News December 10, 2024
ఆధార్ ఉన్న వారికి శుభవార్త
AP: ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.
Similar News
News February 5, 2025
గురువారం చోరీలు, వీకెండ్లో జల్సాలు
TG: గచ్చిబౌలి <<15340404>>కాల్పుల కేసులో<<>> అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకర్‌కూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు ప్లానింగ్, గురువారం చోరీ, వీకెండ్లో జల్సాలు చేస్తాడు. ₹10L దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడు. జీవితంలో ₹335Cr కొట్టేయాలని, 100మంది అమ్మాయిలతో గడపాలనేది ఇతని లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది.
News February 5, 2025
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత
ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
News February 5, 2025
పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్‌లో టాప్!
భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్లైన్లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.