News June 21, 2024
అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్
AP: ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు 56.53 KM రైల్వే లైన్ భూసేకరణకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త లైన్‌లో పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో 9 స్టేషన్లు నిర్మిస్తారు. అమరావతిని ప్రధాన స్టేషన్‌గా ఉండనుంది. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3KM వంతెన నిర్మిస్తారు. ఇందు కోసం రూ.2600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
Similar News
News September 19, 2024
ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు
AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.
News September 19, 2024
అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో రూ.15వేలు!
మార్కెట్‌లో ఎన్నో బియ్యం రకాలున్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ధర క్వింటాకు రూ.5-6 వేలు ఉండొచ్చు. అయితే, అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారన్న విషయం తెలుసా? జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ.15వేలు ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్‌లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.
News September 19, 2024
వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని భారత్ సహా పలు దేశాల పరిశోధకులు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ‘బ్రెయిన్ స్ట్రోక్’ మరణాల్లో 14శాతం వాయు కాలుష్యం వల్లేనని వారు పేర్కొన్నారు. గగనతల కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వలన గత 3 దశాబ్దాల్లో మెదడు సంబంధిత మరణాలు బాగా పెరిగాయని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య 1990తో పోలిస్తే 2021 నాటికి 70 శాతం పెరిగిందని తెలిపారు.