News February 18, 2025
అంగన్వాడీలకు గుడ్ న్యూస్

AP: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులివ్వనుంది. దీంతో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు ఇస్తున్న ₹లక్ష మొత్తం సగటున ₹1.55 లక్షలకు పెరగనుంది. సర్వీసును బట్టి కొందరికి ₹2-2.5L అందనుంది. ఆయాలకు ఇచ్చే ₹40K సగటున ₹65-75Kకు చేరనుంది.
Similar News
News March 27, 2025
IT కంపెనీలు, ఉద్యోగులకు Shocking News

దేశీయ IT కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్‌ను మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్‌లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60% ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester తెలిపింది. గతంలో 3-5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టనుంది.
News March 27, 2025
రాత్రి 7.30కు పవర్ కట్ అంటూ సైబర్ మోసం

TG: సైబర్ నేరగాళ్లు కొత్త మోసంతో మాయ చేస్తున్నారు. ‘మీరు గత నెల కరెంట్ బిల్ చెల్లించలేదు. ఇవాళ రాత్రి 7.30కు పవర్ కట్ అవుతుంది’ అని పలువురు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ వర్గాలు స్పందించాయి. TGSPDCL ఎప్పుడూ ఇలాంటి మెసేజ్‌లు పంపదని, ఉద్యోగులెవరూ వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకోరని స్పష్టం చేశాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
News March 27, 2025
డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ ఆందోళన

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.