News March 23, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు GOOD NEWS

TS: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో విడత ట్రైనింగ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని TSSP ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం కాగా, సరిపడా వసతులు లేకపోవడంతో మిగతా వారి ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు వసతులు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని TSSP తెలిపింది.
Similar News
News December 7, 2025
50 ఏళ్ల నాటికి సరిపోయేలా ‘ఒంటిమిట్ట’ అభివృద్ధి

AP: పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధిపై TTD ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. మరో 50 ఏళ్లలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. వసతి, రవాణా, కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, మ్యూజియమ్, ఉద్యానవనాలు, డిజిటల్ స్క్రీన్స్, కళామందిరం, 108Ft జాంబవంతుడి విగ్రహం, మాడ వీధుల అభివృద్ధి, CC కెమెరాలు వంటి వాటిపై EO సింఘాల్ అధికారులకు సూచించారు.
News December 7, 2025
RGSSHలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఢిల్లీలోని <
News December 7, 2025
DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్‌గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.


