News April 7, 2024

డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్‌న్యూస్

image

TG: ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈనెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు ₹10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు ₹2వేలకు తగ్గించినట్లు తెలిపారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

Similar News

News April 18, 2026

HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

image

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్‌ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.

News April 18, 2026

B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

image

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్‌ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.