News September 10, 2024
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్
AP: రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. కాగా 16,347 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News October 5, 2024
అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 5, 2024
‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు
కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్‌కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.