News March 8, 2025
ఉద్యోగులకు GOOD NEWS

TG: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని JAC నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగులు బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు.
Similar News
News January 24, 2026
కిషన్ రెడ్డి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నా: భట్టి

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు Dy.CM భట్టి అన్నారు. ‘105ఏళ్లుగా సింగరేణి కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్ణయాలు మంత్రి వద్దకు రావు. కోల్ ఇండియా 2018లో టెండర్ డాక్యుమెంట్ పంపింది. సైట్ విజిట్ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్లో ఉంది. ఆ సమయంలో మా ప్రభుత్వం లేదు. 2021, 2023లో కోల్ ఇండియా, NMDC పంపిన డాక్యుమెంట్లలోనూ సైట్ విజిట్ అని ఉంది’ అని స్పష్టం చేశారు.
News January 24, 2026
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.
News January 24, 2026
దోపిడీదారుల ప్రయోజనం కోసమే కట్టుకథలు: భట్టి

TG: కొంతకాలంగా సింగరేణిపై కట్టుకథలు, అడ్డగోలు రాతలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాల కోసమే ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని సందేహం వ్యక్తం చేశారు.


