News March 8, 2025
ఉద్యోగులకు GOOD NEWS

TG: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని JAC నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగులు బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు.
Similar News
News January 13, 2026
విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
News January 13, 2026
శుభ సమయం (13-1-2026) మంగళవారం

➤ తిథి: బహుళ దశమి మ.3.46 వరకు
➤ నక్షత్రం: విశాఖ రా.12.53 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.04-8.25 వరకు, ఉ.9.32-11.11 వరకు, తిరిగి మ.12.06-1.01 వరకు, తిరిగి మ.2.51-5.37 వరకు
➤ రాహుకాలం: మ.3.00-సా.4.30 వరకు
➤ యమగండం: ఉ.9.00-10.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.8.47-9.31 వరకు, తిరిగి రా.10.48-11.40 వరకు ➤ వర్జ్యం: తె.5.19 లగాయతు
News January 13, 2026
నేటి ముఖ్యాంశాలు

❂ AP: పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం: CBN
❂ యువత భవిష్యత్తును ప్రభుత్వం ప్రమాదంలో పడేసింది: జగన్
❂ చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు
❂ TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: రేవంత్
❂ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించిన ప్రభుత్వం
❂ జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే: కేటీఆర్
❂ మున్సిపాలిటీల్లో మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు


