News March 25, 2025

ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

image

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.

Similar News

News April 25, 2025

ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన ప్రయాణాలు

image

పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. US, UK, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదూర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైమ్ పెరగడంతో టికెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News April 25, 2025

కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

image

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.

News April 25, 2025

ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

image

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం

error: Content is protected !!