News December 17, 2024
ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
TG: ఉస్మానియా, JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. అసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. JNTUలో క్రెడిట్ స్కోర్ 25%, ఓయూలో 50% ఉంటే ప్రమోట్ చేస్తున్నారని అక్బరుద్దీన్ అన్నారు. రెండు వర్సిటీల్లో వేర్వేరు విధానం ఉండటంతో దీనిపై కాలేజీ యాజమాన్యాలతో సమావేశమవుతామని మంత్రి తెలిపారు.
Similar News
News January 24, 2025
మీ పిల్లలు ఎంతసేపు నిద్ర పోతున్నారు?
పోషకాహారంతో పాటు సరైన నిద్ర పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 6-12 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు కనీసం 9గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారని చెబుతున్నారు. వీళ్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నిద్ర సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
News January 24, 2025
వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలు: భట్టి
TG: వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజాభవన్‌లో అన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వం వదిలేయడం వల్లే భారం పెరిగిందని, పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్-2 ప్రారంభించుకున్నామని భట్టి తెలిపారు.
News January 24, 2025
ఈ బ్లడ్ గ్రూప్ వారు నాన్‌వెజ్ తింటున్నారా?
కొందరికి నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు. ఎక్కువ మంది చికెన్, మటన్ తినడానికి ఇష్టపడతారు. కొన్ని బ్లడ్ గ్రూపుల వారు మాంసాహారం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక వ్యవస్థ సున్నితంగా ఉండి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. చికెన్, మటన్ వంటివి జీర్ణించుకోలేరు. వీరు పప్పులు, కూరగాయలు తినడం బెటర్. B గ్రూప్ వారు ప్రతిదీ తినొచ్చు. AB, O గ్రూప్ వారు సమతుల్యంగా తినాలి.