News October 2, 2024
రైతులకు శుభవార్త
తెలంగాణలో పామాయిల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి, అన్నదాతలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు.
Similar News
News January 9, 2025
ఢిల్లీని గాలికొదిలేసిన గాంధీలు.. మీ కామెంట్!
సోనియా కుటుంబానికి తెలియకుండా కాంగ్రెస్‌లో చీమైనా చిటుక్కుమనదు! అలాంటిది ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటికీ రాహుల్, ప్రియాంకా గాంధీలు ఢిల్లీ దంగల్‌ను పట్టించుకోవడమే లేదు. AAP, BJP పోటాపోటీగా దూసుకెళ్తుంటే క్యాంపెయిన్ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో కాంగ్రెస్ వెనకబడింది. అగ్రనేతలెవరూ కానరావడం లేదు. RG ఎక్కడున్నారో తెలియదు. వారి తీరు ఓడిపోయే మ్యాచుకు ఆర్భాటం అనవసరం అన్నట్టుగానే ఉందా? మీ COMMENT
News January 9, 2025
బీజేపీ, ఆప్ మధ్యే పోటీ: కేజ్రీవాల్
త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో ఆమ్ ఆద్మీ పార్టీ నేరుగా తలపడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆప్ పోటీ చేయట్లేదని పేర్కొన్నారు. అయితే తమ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇండియా కూటమి నాయకులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 9, 2025
కాఫీ ఏ టైమ్‌లో తాగుతున్నారు?
రోజంతా కాకుండా కేవలం ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయని తాజాగా చేసిన ఓ సర్వే పేర్కొంది. యూఎస్‌లోని తులనే యూనివర్సిటీలోని నిపుణుల బృందం దశాబ్దానికి పైగా చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలను ప్రకటించింది. ఇతర సమయాల్లో కాఫీ తాగే వారితో పోలిస్తే ఉదయాన్నే తాగే వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. సాయంత్రం కాఫీ తాగేవారిలో గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.