News November 13, 2024

రైతులకు GOOD NEWS

image

TG: రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 8, 2024

అలాగైతే క్షమాపణలు చెబుతాం: సీఎం రేవంత్

image

TG: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒకవేళ జరిగినట్లు నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని ప్రధాని మోదీ, కేసీఆర్‌లకు సవాల్ విసిరారు. దేశంలో BJP ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కడతామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే అడ్డుపడుతున్నాయని, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని సీఎం నిలదీశారు.

News December 8, 2024

ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు తెలుసా?

image

కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%

News December 8, 2024

బుమ్రాకు గాయమైందా?

image

అడిలైడ్‌లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్‌లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.