News January 24, 2025
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.
Similar News
News January 24, 2025
ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?
TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
News January 24, 2025
బీఆర్ఎస్ పార్టీకి షాక్
TG: కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
News January 24, 2025
సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.